నవాబ్‌పేట, నవంబర్ 20 : తన కూతురు ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని.. తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబ్‌పేట మండలంలోని హన్మసానిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విక్రమ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని హన్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌల్ల గౌతమి అనే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె చందు అనే యువకుడిని ప్రేమించినట్లు ఎస్సై తెలిపారు.
కాగా వీరిద్దరు గత రెండు రోజుల కింద ట వారి ఇండ్లలో నుంచి పారిపోగా… అమ్మా యి తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇంటికి తీసుకువచ్చిన గౌతమిని తల్లిదండ్రులు అరుణ, ఎల్లయ్య వారించినా..వినకుండా ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు ఎస్సై వివరించారు. ఇతర కులస్తుడిని తన కూతురు ప్రేమించిందని.. తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయి తండ్రి ఎల్లయ్య.. గ్రామ శివారులో ని వ్యవసాయ పొలానికి వెళ్లి చె ట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తె లిపారు. ఎల్లయ్య మృతిపై అతడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.