జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం(Jadcharla Mandal) మాచారం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి . 44వ జాతీయ రహదారి ( National Highway ) పై కారు, ఆర్టీసీ బస్సు ఢీ కొనగా కారులో ఉన్న వెంకటరెడ్డి(70), టున్ను (20) అనే ఇద్దరు మృతి చెందగా ఉన్ని అనే మహిళ తీవ్రంగా గాయపడింది.
మృతిచెందిన వారు మహబూబ్ నగర్ ప్రేమ్‌నగర్ కాలానికి చెందిన వాసులుగా గుర్తించారు. హైదరాబాదు నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తుండగా మాచారం గ్రామం వద్ద ఫ్లైఓవర్ చివరలో కారు టైర్ ఫంక్చర్ అయ్యింది. దీంతో కారు అతివేగంగా డివైడర్‌ను ఢీ కొట్టి అవతలివైపు పడిపోవడంతో మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
కారులో ప్రయాణిస్తున్న తాత వెంకటరెడ్డి, మనవడు టున్ను అక్కడికక్కడే మృతి చెందగా మున్ని తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన మున్నిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.