కల్వకుర్తి, ఫిబ్రవరి 17: రైతులకు ఇచ్చిన హామీలు అమలు పరచకుం డా, రైతులను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ, రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆమనగల్లు జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహించనున్న రైతుదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహా రైతుధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు ఉప్పల వెంకటేశ్, గోళి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. పెద్దసంఖ్యలో రైతులు దీక్షకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుదీక్షకు వచ్చే రైతులకు మాడ్గుల రోడ్డులోని భవానీ గార్డెన్లో భోజన వసతి కల్పించినట్లు ఉప్పల వెంకటేశ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుందని, అప్పటి వరకు రైతులు సభాస్థలి వరకు చేరుకోవాలని వారు కోరారు.