అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 18 : కష్టపడి చదివితే ఏ ఉద్యోగమైనా సాధ్యమని నిరూపించిం ది ఓ యువతి. ఒకే ప్రయత్నం లో నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉ ద్యోగాలు సాధించి ప్రతిభ చా టింది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరుకు చెందిన మురళీధర్‌రెడ్డి, మాధవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కూతురు ఉన్నతి సీబీఎస్సీలో బీటెక్ పూర్తి చేసింది.
ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ద్వారా నిర్వహించిన పరీక్షల్లో కెనరా బ్యాంక్ పీవోగా.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీవోగా.. న్యూ ఇండియా ఇన్పూరెన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉద్యోగాలు సా ధించింది. అలాగే ఎస్ఎస్సీజీఎల్ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గెజిటెడ్ లెవెల్ సెలక్షన్స్) ద్వారా నిర్వహించిన పరీక్షలోనూ జీఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. నాలుగింట్లో జీఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ పోస్టును ఎంపిక చేసుకున్నట్లు ఉన్నతి తెలిపింది.