యాసంగిలో రైతన్న పంట పండింది. కాలం కలిసి రావడంతో వేరుశనగ దిగుబడి బాగా వచ్చింది. ఎంజీకేఎల్ సాగునీటి రాక.. నిరంతర విద్యుత్.. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలతో రైతన్న ఇంట సిరుల దిగుబడి
వచ్చింది. దీంతో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌ను పల్లీరాశులు ముంచెత్తుతున్నాయి. మంచి ధర వస్తుండడంతో రైతన్న మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– కల్వకుర్తి, ఫిబ్రవరి 23
కల్వకుర్తి, ఫిబవరి 23 : రైతులకు యాసంగి సీజన్ కలిసివచ్చింది. వేరుశనగ సాగుచేసిన రైతు ల కండ్లల్లో ఆనందం తాండవిస్తున్నది. వానకాలంలో పత్తి సాగుచేసి దిగుబడి లేక, ధర రాక కుదేలైన కర్షకులు.. ఈసారి పల్లీ పంట సాగుతో కాస్త స్థిమితపడనున్నారు. దిగుబడి, ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ నుంచి సాగునీటి వసతి కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం దాదాపు 10 వేల బస్తాల వేరుశనగ ధా న్యాన్ని రైతులు తీసుకొచ్చారు. ఈ యాసంగి సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో పల్లీరాశులు రావడం తొలిసారని మార్కెట్ అధికారులు తెలిపారు. సీజ న్ ప్రారంభమై 15 రోజులు కావస్తుందని, ఇప్పటి వరకు దాదాపు 20వేల బస్తాలు మాత్రమే వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసి కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టినట్లు మార్కెట్ కార్యదర్శి భగవంత్ తెలిపారు. రహస్య టెండర్ విధానం మేరకు వేరుశనగను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పెద్దది. దీంతో నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటను విక్రయించుకునేందుకు ఇక్కడికే తీసుకొస్తారు. ఈ క్రమంలో వేరుశనగను కల్వకుర్తి మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున రావడంతో పల్లీ రాశులతో మార్కెట్ నిండిపోయింది. రైతులు, వ్యాపారులతో కళకళలాడుతున్నది. పల్లీని కొనుగోలు చేసేందుకు 12 మంది ట్రేడర్లు, 22 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.8,369 ధర పలికింది.
కల్వకుర్తి, మిడ్జిల్, ఊర్కొండ, వంగూర్, వె ల్దండ, చారకొండ మండలాల్లో దాదాపు 25 వేల ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు సాగు చేశా రు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో పంట ఆశించిన మేర దిగుబడి వచ్చింది. క్వింటాకు ధర గరిష్ఠంగా రూ.8,400 నుంచి రూ.8,600 వరకు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకూ 10 నుంచి 12 కింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చిందని అన్నదాతలు సంతోషంతో చెబుతున్నారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తెచ్చిన ఆనందం ఇది. ఐదేండ్ల కిందట కల్వకుర్తి ప్రాంతంలో యాసంగిలో పశువులను బతికించుకునేందుకు పచ్చగడ్డి సాగుచేసేవారు. కేవలం వానకాలంలో మాత్రమే పంటలు వేసేవారు. కానీ ఎంజీకేఎల్ఐ సాగునీరు మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి, వంగూర్, వెల్దండ, చారకొండ మండలాల్లో పరుగులు పెడుతున్నది. కాల్వలు నిండుగా పారుతుండగా.. చెరువులు జలకళకను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
బోరుబావులు రీచార్జి అయ్యాయి. నిరంతర కరెంట్ సరఫరాతో పంటల సాగుకు ఏ కష్టం లేదు. దీంతో వ్యవసాయం పండుగలా సాగుతుండగా.. సిరుల పంటలు పండిస్తూ కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐదెకరాల్లో వేరుశనగ పంట సాగుచేశా రు. ఎంజీకేఎల్ఐ సా గునీరు మా ప్రాంతానికి రావడంతో భూ గర్భ జలాలుపైనే ఉన్నాయి. సాగునీటి ఏమాత్రం ఇబ్బంది లేదు. వేరుశనగ దిగుబడి బాగానే వచ్చిం ది. ప్రసుత్తం 100 బస్తాల పల్లీని కల్వకుర్తి మార్కెట్‌కు తీసుకొచ్చాను. ధర భాగానే ఉన్నది. మా ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – వెంకటయ్య, రైతు,
తుమ్మలపల్లి, వంగూర్ మండలం