వనపర్తి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. చెరువులు నిండడంతో కాల్వలు పారుతున్నాయి. బోరుబావులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. వరి శిస్తును ముగించిన అన్నదాత ఇక యాసంగిలో ఆరుతడులతో వేసే పంటలవైపు అడుగులు వేస్తున్నాడు. వీటిలో ప్రధానంగా వేరుశనగ, పెసర, మినుములు, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేందుకు సమాయాత్తమవుతున్నాడు. ఇందుకోసం రైతులకు స్ప్రింక్లర్ పైపులు, నల్లాల అవసరమే ఎక్కువగా ఉంటుంది.
ఏటా స్ప్రింక్లర్ పైపులు, నల్లాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకొని, డీడీలు సైతం తీసి ఉద్యానశాఖ కార్యాలయంలో అం దించడం ఆనవాయితీ. అయితే, స్ప్రింక్లర్ల కోసం డీడీలు తీసి న రైతన్నలకు ఏడాదికిపైగా ఎదురు చూపులు తప్పడం లే దు. జిల్లాలో స్ప్రింక్లర్ పైపుల డిమాండ్ తీవ్రంగా ఉన్నది. ఈ మేరకు ఉద్యానశాఖ ద్వారా అవసరం ఉన్న రైతులంతా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 6,500 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగా వీరిలో మరో 400 మంది రైతులు డీడీలు కూడా తీసి ఉద్యానశాఖ కార్యాలయంలో అందించారు.
ఒక్కొక్క రైతుకు ఒక యూనిట్ చొ ప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఒక్కొక్క యూనిట్లో 25 పైపులు, ఐదు నల్లాలను సబ్సిడీపై ఇస్తున్నారు. వీటి ధర రూ.23,385 కాగా, రైతులకు రూ.7,483కే సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. ఈ పథకం గత ప్రభుత్వం హయాంలో నూ అమలు చేశారు. ఈ క్రమంలో గత ఏడాది 2023-24 కు సంబంధించి 3;500 యూనిట్లు జిల్లాకు మంజూరు కాగా, అప్పట్లో రైతన్నలకు పంపిణీ చేశారు. ఎక్కువ యూనిట్లు మంజూరు కావడంతో సమస్యే రాలేదు.
వందలామంది రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తుంటే.. కేవలం 162 యూనిట్లు మాత్రమే జిల్లాకు మంజూరయ్యా యి. ఎక్కువ మంది రైతులుండడం వల్ల ఎలా పంపిణీ చే యాలో అధికారులకు అర్థం కావడం లేదు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాల నుంచి ఎక్కువ దరఖాస్తులు, డీడీలు తీసిన రైతులున్నారు. ఆన్లైన్ రిజిస్ర్టేషన్ సీనియార్టీని బట్టి యూనిట్లను పంపిణీ చేయాలని భావించి నా ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదు. ప్రతి మండలానికి పది యూనిట్ల చొప్పున కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకూ రైతులపై ఒత్తిడి పెరుగుతుంది. ఏండ్ల తరబడి డీడీలు కట్టి ఎదురుచూస్తున్నామని, ఇంకా ఎంతకాలం చూడాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం రైతులు వ్యవసాయ సీజన్లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు వానకాల సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఇక.. ఇప్పటి నుంచి మోటర్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్లపైనే ఎక్కువగా ఆధారపడి రెండో పంట సా గుబడులు చేపట్టాలి. ఈ సీజన్ కోసమే రైతులు రెండేళ్ల నుం చి స్ప్రింక్లర్ కోసం డీడీలు కట్టుకున్నారు. ఎంతో ఆశతో ఎదు రు చూసిన రైతుల ఆశలు ఆడియాశలవుతున్నాయి. జిల్లాకు 162 యూనిట్లను గత జూన్ నెలలో ప్రభుత్వం మంజూరు చేసింది.
దాదాపు నాలుగు నెలలుగా ఈ యూనిట్లు కార్యాలయంలోనే మగ్గుతున్నాయి. కొద్దిమేర మంజూరైన యూనిట్లను పంపిణీ చేయలేక నాలుగు నెలలుగా అధికారులు నాన్చుతున్నారు. దరఖాస్తులు చేసిన రైతుల సంగతి అటుంచితే, కనీసం డీడీలు కట్టిన రైతులకైనా యూనిట్లను అందించలేని దుస్థితి ఉన్నది. ఇదిలా ఉంటే.. 400మంది రైతులు ఉద్యానశాఖలో డీడీలు ఇచ్చిన వారుంటే, అనధికారికంగా స్ప్రింకర్లు సరఫరా చేసే కంపెనీల ఏజెంట్ల దగ్గర కూడా వం దలాది డీడీలు మగ్గుతున్నట్లు సమాచారం. ఇలా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. చాలా మంది రైతులు ఈ యూనిట్లకు ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.
పాన్‌గల్ మండలంలో 49, వీపనగండ్లలో 86, చిన్నంబావిలో 49, పెబ్బేరులో 15, శ్రీరంగాపురంలో 17, గోపాల్‌పేటలో 62, రేవల్లిలో 3, ఖిల్లాఘణపురంలో 9, వనపర్తి లో 24, పెద్దమందడిలో 17, మదనాపురంలో 2, అమరచింతలో 11, కొత్తకోటలో 55.. మొత్తం 400 డీడీలు కట్టారు.
నాకున్న మూడెకరాల మెట్ట పొ లంలో మామిడితోటను పెంచుతున్నాను. స్ప్రింక్లర్లతో నీరు ఆదా అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ స్ప్రింక్లర్లకు రూ.7వేలు డీడీ రూపంలో చెల్లించాను. రెండేండ్లు అవుతున్నా ఇప్పటి వరకు స్ప్రింక్లర్లు రాలేదు. హార్టికల్చర్ అధికారులను అడిగితే అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలం గడుపుతున్నారు. స్ప్రింక్లర్లు లేకపోవడంతో సాగునీటి కాల్వనుంచి మొక్కలు, చెట్లకు నీరు పారడం లేదు. అందుకే ప్రభుత్వం స్ప్రింకర్లు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాం.
– యాదగిరి, రైతు, కేతేపల్లి, పాన్‌గల్ మండలం
తొమ్మిది నెలల కిందట సబ్సిడీ స్ప్రింక్లర్ల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నా. రూ.7 వేలు డీడీ చెల్లిం చి సంబంధిత పత్రాలను హార్టికల్చ ర్ అధికారులకు ఇచ్చాను. ఇప్పటివరకు అతీగతిలేదు. వారిని అడిగితే వస్తాయని తప్పా మరోమాట చెప్ప డం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రై తులపై చిత్తశుద్ధిలేదు. డీడీలు కట్టించుకొని సబ్సిడీ పరికరాలు ఇవ్వకపోవడం దారుణం. సబ్సిడీ ఎత్తేసేందుకు సర్కారు కుట్రలు చేస్తున్నది.
– రవినాయక్, రైతు, తెల్లరాళ్లపల్లి తండా, పాన్‌గల్ మండలం
ప్రస్తుత సీజన్లో స్ప్రింకర్ల అవసరం రైతులకు అధికంగానే ఉన్నది. ఎక్కువగా వేరుశనగ, పెసర, మినుముల పం టలకు వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం జిల్లాకు 162 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. గతంలో మిగిలి న రైతులను పరిగణలోకి తీసుకుంటాం. సీనియార్టీ మేరకు ఉన్న యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. తక్కువ యూనిట్లు రావడం.. ఎక్కువ డిమాండ్ ఉండడం వల్లే కొంతజాప్యం జరిగింది. మరిన్ని యూనిట్లు తెప్పించేందుకు ప్రతిపాదనలు పంపాం. రైతులకు సరిపడా యూనిట్లు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం.
– నాగిరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, వనపర్తి