కొర్రీలతో కోత
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్కడా పొంతన లేకపోవడం..
- కల్వకుర్తిలో రుణమాఫీ మాయాజాలం
- డీసీసీబీ బ్రాంచ్‌లో 3,651 మందికి 726 మంది రైతులకే వర్తింపు
- బ్యాంకర్లు, అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
- రుణమాఫీ తీరుపై అన్నదాత ఆగ్రహం
- రైతన్నల ఆందోళన
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్కడా పొంతన లేకపోవడం.. రైతులను అయోమయానికి గురి చేస్తున్నది. రూ.లక్ష వరకు బ్యాంక్‌లో వ్యవసాయ రుణం ఉన్న ప్రతి రైతుకూ మొదటి విడుతలో మాఫీ చేశామని సర్కారు ప్రకటించింది. కానీ చాలా మంది తమకు ఇంకా వర్తించలేదని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల వద్దకు పరుగులు పెడు తున్నారు. ఇంతకూ తమకు రుణమాఫీ అవు తుందా..? లేదా అన్న సందేహాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
– కల్వకుర్తి, జూలై 24
అసలుకంటే మిత్తే ఎక్కువగా..
కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన రైతు నాదిరి బలరాం కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీసీఎస్‌లో)లో వ్యవసాయ రుణం తీసుకున్నాడు. 2023 అక్టోబర్ 10వ తేదీన తాను తీసుకున్న రుణాన్ని రెన్యువల్ చేసుకొని రూ.45 వేలు తీసుకున్నాడు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో పీఏసీసీఎస్ అధికారులు 2023, డిసెంబర్ 12 నాటికి అసలు రూ.45,000, మిత్తి రూ.569తో కలిసి రూ.45,569 అయ్యిందని అధికారులకు పంపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ జాబితాలో బలరాం పేరు లేదు. తనకు రుణమాఫీ ఎందుకు రాలేదని పీఏసీసీఎస్ అధికారులను వాకబు చేశాడు. తాము రుణ వివరాలన్నీ ప్రభుత్వానికి పంపించాం.. తమ తప్పేమి లేదని, వ్యవసాయాధికారులను సంప్రదించమని పీఏసీసీఎస్ అధికారులు, బలరాంకు చెప్పి పంపించారు.
బలరాం నేరుగా కల్వకుర్తి వ్యవసాయాధికారులను కలిసి సమస్య విన్నవించాడు. వ్యవసాయాధికారులు తమ వద్ద ఉన్న యాప్‌లో చూస్తే తీసుకున్న వ్యవసాయ రుణానికన్నా మిత్తి ఎక్కువగా ఉన్నది. అందుకే మాఫీ కాలేదని చెప్పడంతో బలరాం దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇలా రకరకాల సాంకేతిక కారణాలతో చాలా మంది అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉన్నదని కర్షకులు మండిపడుతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆచరణను పక్కనపెట్టి గొప్పలకు పోయి నవ్వుల పాలైందని రైతు సంఘం నాయకులు దుయ్యబడుతున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చిందన్నట్లు’..
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న చందంగా.. రైతు రుణమాఫీ బ్యాంకర్లు, వ్యవసాయాధికారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. మాకు రూ.లక్ష వరకే రుణం ఉన్నది.. నాకు ఎందుకు మాఫీ కాలేదని రైతులు బ్యాంకు, వ్యవసాయాధికారులను నిలదీస్తున్నారు. అందరికీ వచ్చి మాకు ఎందుకు రాలేదు.. మీరే ఏదో చేశారని అనుమానంగా, అమాయకంగా అడుగుతుండడంతో రైతులకు బ్యా ంకర్లు, వ్యవసాయాధికారులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. మాఫీ అయిన రైతుల్లో కొందరికి తీసుకున్న రుణం మాత్రం ఉంటే గతేడాది జనవరిలో ఒక రైతు రూ.60 వేలు తీసుకుంటే రూ.60 వేలు మాత్రమే రుణమాఫీ అయ్యింది.
మరికొందరు రైతులు రూ.60 వేలు తీసుకుంటే 2023 డిసెంబర్ 12వ తేదీ వరకు మిత్తితో కలిపి వచ్చింది. ఇలా పలు చోట్ల తిరకాసు ఉన్నదని, గత కేసీఆర్ సర్కారు రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేసేందుకు రూ.28 వేల కోట్లు వినియోగిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రూ.లక్ష వరకు కేవలం రూ.6.080 కోట్లు మాత్రమే వినియోగించిందని.. ఇందులోనూ చాలా మతలబు ఉన్నదని నాయకులు అం టున్నారు. ఏదేమైనా భూమి పట్టాదారు పాసుపుస్తకం ఉండి రూ.2 లక్షల రుణం ఉన్న ప్రతి రైతు కూ మాఫీ చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రుణమాఫీపైనే సందేహాలు
రూ.లక్ష వరకు రుణాలు చాలామంది రైతులకు వర్తించకపోవడంతో రుణమాఫీ ఏ ప్రాతిపదికన చేశారనే సందేహాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం రేషన్‌కార్డు, ఐటీ చెల్లించే వారిని ప్రామాణికంగా తీసుకున్నారా..? లేదా ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన విధంగా పరిగణలోకి తీసుకున్నారా..? అనేది అర్థం కాని పరిస్థితి. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఎందరిపై రుణం ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని, ఐటీ చెల్లించే వారికి వ ర్తించదని జీవో సారాంశం.
రేషన్ కార్డు కేవలం కు టుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు మా త్రమేనని, ఐటీ అనేది పెద్ద ఉద్యోగులకు మాత్రమేనని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. దురదృష్టం ఏమిటంటే.. ఇల్లు, వాహనాల రుణాన్ని పొందేందుకు చాలామంది ఏ ఉద్యోగం లేకున్నా.. నామమాత్రం ఐటీ కడుతున్నారు. నామమాత్రం ఐటీ కట్టేవారికి కూడా మాఫీ వర్తించలేదని తెలుస్తుంది. మొత్తం మీద రుణమాఫీ ప్రక్రియ లోపభూయిష్ట విధానాలతో ఉన్నదని, అందుకే చాలామంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని, ఇందులో తీసుకున్న జాబితాలో చాలా సాంకేతిక సమస్యలు ఉండటంతోనే మాఫీ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మిగిలిందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
రుణమాఫీ రాలేందంటున్నారు..
వీపనగండ్ల ఐవోబీ బ్యాంక్‌లో క్రాప్‌లోన్ రూ.20 వేలు తీసు కున్నాం. మాకు 30 గుంటల భూమి ఉంది. మాఫీ లిస్టులో నా పేరుంది. రుణమాఫీ జరిగి కూడా వారం రోజులు అయ్యి ంది. బ్యాంకుకు పోయి అడిగితే, ఇంకా రాలేదు, టైం పడు తుంది అంటున్నారు. మాకు అర్థం కావడం లేదు. చు ట్ట్టూ గ్రామాల్లోని బ్యాంకుల్లో డబ్బులు జమ కావడమేందీ..ఇక్కడ కాకపోవుడు ఏందో అధికారులకే తెలియాలే.
– మోహన్‌గౌడ్, రైతు, వీపనగండ్ల, వనపర్తి జిల్లా
డీసీసీబీ కల్వకుర్తి బ్రాంచ్ పరిధిలో..
డీసీసీబీ కల్వకుర్తి బ్రాంచ్ పరిధిలో మొత్తం 5 (కల్వకుర్తి, వెల్దండ, చారకొండ, మిడ్జిల్, రంగాపూర్)ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీసీఎస్) ఉన్నాయి. వీటిలో 3,651 మంది రైతులు రూ.లక్ష రుణానికి అర్హత ఉంటే కేవలం 726 మంది రైతులకు మాత్రమే మాఫీ అయ్యింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

