Ramapuram | వడ్డేపల్లి : రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్ టీచర్లు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి కేవలం ఎంపీసీ, బైపిసి గ్రూపులే కాకుండా వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా చదువుకుంటే భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంటుందని సూచించారు. రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు బోధించడం జరుగుతుందని తెలియజేశారు. అదే విధంగా ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలని, పదవ తరగతి ఫలితాల్లో మంచి జీపీఏ సాధించాలని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బోధిని కళాశాల యాజమాన్యం వారు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో వివిధ తరగతుల వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.