నాగర్‌కర్నూల్, జూలై 22 : నాగర్‌కర్నూల్ జిల్లాలో వారంరోజులుగా సంచలనంగా మా రిన నకిలీ డీఏపీ ఎరువులను విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో తక్కువ ధరలకు డీఏపీ విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు అగ్రికల్చర్ అధికారి కమల్‌కుమార్, ఎస్సై శంషోద్దీన్లు గ్రా మాన్ని సందర్శించి ఆరుగురి రైతులను విచారించగా ఎద్దుల నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద డీఏపీ కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు.
వారి నుంచి స్వాధీనం చేసుకున్న 110బస్తాల డీఏ పీ ఎరువు నకిలీవిగా తేలిందని, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నకిలీ డీఏ పీ సరఫరా చేసిన విక్రయించిన వారి గుట్టు రట్టయినట్లు తెలిపారు. నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తిమ్మాజిపేట మండలం అమ్మపల్లికి చెందిన దోమ శ్రీకాంత్‌రెడ్డి, బుద్ధ సముద్రానికి చెందిన గంగారాం నరేశ్, కోడుపర్తికి చెందిన సర్కపల్లి అశో క్, బిజినేపల్లి వెల్గొండకు చెందిన నాగోలు ఉదయ్‌కుమార్‌రెడ్డి, నాగోలు నవీన్‌రెడ్డి, నాగోలు సంతోష్‌రెడ్డి, అల్లీపూర్ గ్రామానికి చెందిన మ లిశెట్టి ప్రకాశ్‌లు ఏ-5గా ఉన్న అశోక్‌రెడ్డి ద్వా రా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలోని జగదీశ్ అనే వ్యక్తికి చెందిన త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ ద్వారా నకిలీ డీఏపీని నాగర్‌కర్నూల్ జిల్లాకు సరఫరా చేసి విక్రయించారన్నారు.
మొత్తం నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, మిడ్జిల్ మండలాల్లో 4వేల బస్తాల నకిలీ డీఏపీని విక్రయించారన్నారు. వీరి ద్వారా ఎవరెవరికీ విక్రయించారనే విషయాలను విచారణ చేపట్టినట్లు తెలిపా రు. ఈముఠాలో ఏ-1గా ఉన్న ఎంటర్ ప్రైజెస్ యజమాని జగదీశ్, ఏ-9గా ఉన్న నాగోలు సంతోష్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఏ-3గా ఉన్న శ్రీకాంత్‌రెడ్డి 100 బస్తాల నకిలీ డీఏపీని తెప్పించి అమ్మపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి 20బస్తాలు, బాల్రెడ్డికి 30బస్తాలు, శివారెడ్డికి 30బస్తాలు, శ్రీకాంత్‌రెడ్డికి 20బస్తాలను విక్రయించడంతోపాటు తన సొంత పొలానికి వాడుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. అశోక్‌రెడ్డి అనే వ్యక్తి వెల్గొండకు చెందిన ఉదయ్‌కుమార్ రెడ్డికి 2,900 బస్తాలు ఇప్పించగా, వాటిని నరేందర్‌రెడ్డికి 150 బస్తాలు పంపగా మిగిలిన 110 బస్తాలను అగ్రికల్చర్ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా అమ్మపల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి కూడా 100 బస్తాలు పంపించగా 80 బస్తాలను అగ్రికల్చర్ అధికారులు సీజ్ చేశారన్నారు. ఏ-7గా ఉన్న వెల్గొండకు చెందిన నవీన్‌రెడ్డి 210 బస్తాలు తెప్పించి ఇందులో విరాజిపల్లి నారాయణరెడ్డికి 25 బస్తాలు అమ్మగా, మిగిలిన 185 బస్తాలను అగ్రికల్చర్ అధికారులు సీజ్ చేశారన్నారు. ఏ-6గా ఉన్న ఉదయ్‌రెడ్డి 2900 బస్తాలతో మిడ్జిల్ మండలం బోయినపల్లికి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డికి 900 బస్తాలు, మిడ్జిల్‌కు చెందిన శ్రీనివాస్‌కు 800 బస్తాలు, తాడూరు మండలానికి చెందిన చంద్రమౌళికి 500 బస్తాలు ఇప్పించినట్లు తెలిపారు. ఇంకా కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన మధురెడ్డికి 200 బస్తాలు, వెల్గొండకు చెందిన సంతోష్‌రెడ్డి, అల్లీపూర్‌కు చెందిన ప్రకాశ్లకు 400 బస్తాలు కమీషన్‌పై ఇప్పించినట్లు తెలిపారు.
ఇంకా వెల్గొండకు చెందిన రైతులు శివకాంత్‌రెడ్డి, బీమారెడ్డిలకు 100 బస్తాలు ఇవ్వగా వారు తమ సొంత పొలానికి వాడుకున్నారన్నారు. ఏ-7గా ఉన్న నవీన్‌రెడ్డి 210 బస్తాల నకిలీ డీఏపీని వెల్గొండకు చెందిన నారాయణరెడ్డి అనే రైతుకు కమీషన్ మేరకు అమ్మినట్లు తెలిపారు. ఏ-8గా ఉన్న అల్లీపూర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ వెల్గొండ గ్రామానికి చెందిన ఉదయ్‌రెడ్డి వద్ద 150 బస్తాలను కొనుగోలు చేసి వాటిని బంధువులు, బావకు 90 బస్తా లు, స్నేహితుడు సూరికి 30 బస్తాలు అమ్మగా, మిగతావి సొంత పొలానికి వాడుకున్నట్లు తెలిపారు. మొత్తం నాగర్‌కర్నూల్ జిల్లా కు 4వేల బస్తాలకుపైగా నకిలీ డీఏపీ ఎరువులను సరఫరా చేసినట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, ఏడీ పూర్ణచందర్‌రెడ్డి, ఎస్సై శంషోద్దీన్ ఉన్నారు.