మాగనూరు : వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో మాగనూరు మండల కేంద్రంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం (Eye Medical Camp) విజయవంతం అయ్యింది. బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాగనూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. రాంరెడ్డి లయన్స్ ఆసుపత్రి సౌజన్యంతో వాకిటి శ్రీహరన్న సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపుగా 130మందికిపైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 52 మందికి కంటి చికిత్సలు అవసరముననట్లు గుర్తించారు.
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉచితంగా నిర్వహించడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లయన్స్ వైద్య నిపుణులు జ్యోతి, సత్యంగౌడ్, ఖాజా, నాయకులు వేణు గౌడ్, ఆనంద్, లక్ష్మణ్, చక్రపాణి, ఉదయ్, సమితి సభ్యులు రవికుమార్, నూరుద్దీన్, హుసముద్దీన్, బోయ నరసింహ తదితరులు పాల్గొన్నారు.