అమరచింత, మే 31 : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శనివారం ఎస్సీ శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. మొదటిరోజు ఎగువ జూరాలలో 4 యూనిట్లలో 2.338 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాలలోని 3 యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగగా, 1.849 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు 2.284 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టడడంతో జూరాల గేట్లను మూసివేశారు. జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా నీరు దిగువకు విడుదల అవుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నెల రోజుల ముందుగానే ప్రారంభం అయ్యింది. ఈఏడాది లక్ష్యం మేరకు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తామని ఎస్సీ శ్రీధర్ తెలిపారు.