వనపర్తి టౌన్, జూన్ 20 : విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని.. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి ద్వారా కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన పాఠశాలలను మంత్రి ప్రారంభించారు.
పట్టణంలోని బండారునగర్లో రూ.14.32లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల, రూ.4.92లక్షల వ్యయంతో ఉర్దూ మీడియం పాఠశాల, కేడీఆర్ నగర్లో రూ.10.43లక్షలతో పునరుద్ధరణ చేసిన ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో నూతన ఒరవడి, సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 518 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడుతగా 183 పాఠశాలల్లో రూ.78 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి..
విద్యా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బండారునగర్ ప్రాథమిక పాఠశాలలో మంత్రి నిరంజన్‌రెడ్డి మానవ శరీరం.. పరిసరాల పరిశుభ్రతపై తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. బోర్డుపై ఆంగ్లంలో కలెక్టర్ పేరు, పదాలను రాసి చెప్పించారు. ఉర్దూ పాఠశాలలో ఉర్దూ రాసి అర్థాలను అడిగారు. కేడీఆర్లోని పాఠశాలలో జీకే ప్రశ్నలు రాసి సమాధానాలు రాబట్టారు.
అచ్యుతాపురంలో గదుల ప్రారంభం..
వనపర్తి రూరల్, జూన్ 20 : మండలంలోని అచ్యుతపురం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా నిర్మించిన నూతన గదులను మం త్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్ట ర్ తేజస్ నందలాల్ పవార్, సర్పంచ్ శారద, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.
డబుల్ ఆనందం
వనపర్తి టౌన్, జూన్ 24 : జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 543మందికి డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలో 1,259మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, 543 మందికి ప్రస్తుతం అందిస్తున్నామన్నారు. నియోజకవర్గం మొత్తానికి 2,900 గృహాలు మంజూరు కాగా, మిగతావి నిర్మాణంలో ఉన్నాయన్నారు.