అచ్చంపేట రూరల్, అక్టోబర్ 11 : మండలం లోని దుబ్బతండా వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. గ్రామానికి మంచినీటిని అం దించే మిషన్ భగీరథ నీటి పైపులైన్ లీకేజీ కావడంతో మూడ్రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో పంచాయతీ కార్యద ర్శి, తండా పెద్దలు వ్యవసాయ బోరు నుంచి ఓ పైపు ద్వారా నీటిని అందించగా.. మహిళలు, స్థానికులు ఒక్కసారిగా తరలివచ్చి పోటాపోటీగా నీ టిని పట్టుకొన్నారు.