వడ్డేపల్లి, సెప్టెంబర్ 23: మున్సిపాలిటీ కేంద్రంలోని ఓవార్డులో కౌన్సిలర్ చేపడుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అడ్డుకున్న ఘటన చోటుచేసుకున్నది. వివరాలిలా.. శాంతినగర్ ము న్సిపాలిటీ 10వ వార్డులోని ఓ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కమిషనర్, ఏఈకి కాలనీవాసులు, కౌన్సిలర్లు ఆరునెలలుగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.
దీంతో వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి మున్సిపాలిటీలో తీర్మానం తీసుకొని 60 సిమెంటు పైపులను కొనుగోలు చేశారు. కూలీలతో సోమవారం పనులను ప్రారంభించగా.. మున్సిప ల్ కమిషనర్ లక్ష్మారెడ్డి సిబ్బందిని పంపించి ప నులు నిలిపివేసి, పైపులను తీసుకురావాలని సి బ్బందికి సూచించారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్‌కు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. సమస్య తీవ్రంగా ఉన్నందునే పనులు చేపట్టామని, మీరు అడ్డుకోవద్దని కౌన్సిలర్ భర్త శ్రీనివాసచౌదరి మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
విషయం తెలుసుకున్న పక్కవార్డు కౌన్సిలర్లు ఆంజనేయులు, చైర్పర్సన్ భర్త వడ్డేపల్లి సూ రి, తోటరవి ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందిని వెనక్కి పంపారు. ఈ విషయమై కమిషనర్‌ను వివరణ కోరగా.. టెండర్ కాలేదు, వర్క్ఆర్డర్ ఇవ్వలే దు. వాళ్లంతకు వాళ్లే పనులు చేపడితే ఎలాగని ప్ర శ్నించారు. తీర్మానం చేస్తున్నామంటారు, మరోసా రి కాలనీవాసుల సమస్య తీర్చడానికి సొంతంగా పనులు చేస్తున్నామంటున్నారు. పొంతన లేని స మాధానాలతో పనులు నిలిపి వేసినట్లు తెలిపారు.