వనపర్తి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 12 ఏండ్లకు కాంగ్రెస్‌కు గుర్తురావడం విడ్డూరమని మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం పల్లెత్తు మాట కూడా ప్రశ్నించని కాంగ్రెస్ నేడు అధికారం చేపట్టిన రెండేళ్లకు ఈ ప్రాజెక్టుపై సోయి లేకుండా మాట్లాడటం శోచనీయమన్నారు. మంగళవారం జూరా ల ప్రాజెక్టును మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి పర్యవేక్షణలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు ఎమ్మె ల్యే విజేయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి బృందం సందర్శించింది.
అనంతరం మీ డియాతో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పా లమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హయాంలోనే రూ.27వేల కోట్ల పనులు జరిపించామన్నారు. కేసులు వేసి ఆటంకాలు కల్పించిన కాంగ్రెస్ ఏపీకి అడ్డుపడేందుకు ఉప్పందించారన్నారు. కృష్ణా నీటిపై మాజీ మంత్రి హరీశ్‌రావు కూలంకశంగా వివరించారని, మరోసారి కృష్ణానది నీటిపై క్లారిటీ కోసమే ప్రాజెక్టుల బాట పట్టినట్లు పేర్కొన్నారు. కృష్ణానదిలో తెలంగాణకు నీళ్లు దక్కకుండా మొ దటి నుంచి కుట్రలు జరిగాయని, ఇప్పటికీ పునరావృతం అవుతూనే ఉన్నాయన్నారు. ఉమ్మ డి పాలమూరు జిల్లా బాగుకోసం నాడు నైజాం ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు లను ఏపీలో విలీనం అనంతరం కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, ఎగువ ప్రాంతంలో ప్రతిపాదించిన అప్పర్‌కృష్ణా, భీమాలు ఏర్పాటు చేసి ఉంటే నేడు సాగునీటి కోసం ఈ తండ్లాట ఉండేదికాదన్నారు. పాలమూరు ప్రజల బాధల ను అర్థం చేసుకున్న బచావత్ పుణ్యమా అంటూ 20 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని, జిల్లా ప్రజల తరఫున ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అప్పట్లో సాగునీటిపై నోరుమెదపలేదన్నా రు.
జూరాలకు సగటున 25 రోజులు మా త్రమే వరద ఉంటుందని, ఈ మేరకు 45 రోజులకు మించి మోటర్లను నడిపించడం ఇప్పుడున్న ఎత్తిపోతలకే సాధ్యం కావడం లేదన్నారు. కాం గ్రెస్ మంత్రులు అర్థం.. పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, పాలమూరు ప్రాజెక్టులోని రిజర్వాయర్లను నింపితే ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరూపమే మారిపోతుందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారని, సీఎం రేవంత్‌కు సాగునీటి పారుదలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులో మిగిలిన పనులు చేయకుండా ఏకంగా ప్రాజెక్టునే తప్పుపడుతూ కాలయాపన చేయడం అవగాహన రాహిత్యం తప్పా మరొకటి లేదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
70 టీఎంసీలు ఎలా సాధ్యం ?
– మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 70 టీఎంసీల నీటిని తరలించడం ఎలా సాధ్యమవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల ఎండిపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం క్రాఫ్ హాలీడే ప్రకటించి చేతులు దులుపుకొన్నదన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా అత్యధికంగా నష్టపోయిందని, ఇక్కడి రైతులు, వ్యవసాయం గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి తరలింపు అసాధ్యమని, కేవలం ఐదారు టీఎంసీ ఉండే జూ రాలలో ఉంటాయని, అలాగే శ్రీశైలంలో 220 టీఎంసీల వరకు నీరుంటుందన్నారు.
దీన్ని బట్టి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుందో అందరికీ అర్థమైనా ఒక్క కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ వాదం వచ్చిన తర్వాతే జూ రాల కూడా పూర్తయిందని, అలాగే గతంలో పెం డింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. ఏపీ నాయకులకు తలొగ్గకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఉమ్మడి జిల్లా సాగునీటి ఉపయోగాల దృష్టితో చూడాలని సూచించారు.
చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేయండి
-లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జూ రాల నుంచి సాధ్యం కాదని, అప్పట్లో అందరికీ చెప్పి శ్రీశైలంకు మార్పు చేయడం జరిగిందన్నా రు. కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారానే కోడంగల్-నారాయణపేటల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించేలా డిజైన్ ఉందన్నారు. కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రిజర్వాయర్లకు నీరందించవచ్చన్నారు.
సీఎం, మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సొం త జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే కేసీఆర్ చొరవతో ఉమ్మడి జిల్లాలోని పది లక్షల ఎకరాలకుపైగా సాగు నీరందించడం జరిగిందని గుర్తు చేశా రు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే కేవ లం ఆరు నెలల్లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు డైలాగులు ఆపి పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పూర్తి చేసే పనులపై శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వం సాగునీటిపై నిర్లక్ష్యం వీడని పక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో జల ఉద్యమం చేపడతామని హెచ్చరించా రు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పలుస రమేశ్ గౌడ్, వామన్‌గౌడ్, విశ్వేశ్వర్, నాగన్నయాదవ్, హుస్సేన్, చిట్యాల రాము పాల్గొన్నారు.