దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 21 : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకద్ర సింగిల్‌విండో చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో బుధవారం సింగిల్‌విండో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో సింగిల్‌విండో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు అం దించడంతోపాటు సబ్సిడీ ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతుల పిల్లల ఉన్నత విద్యకు, గృహ నిర్మాణానికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నూతన సహకార సం ఘం భవనం, దుకాణ సముదాయం నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.85లక్షలు మం జూరైనట్లు తెలిపారు. పుట్టపల్లిలోని గోదా ము ప్రహరీ నిర్మాణానికి రూ.3లక్షలు, వెంకటగిరిలో పెట్రోల్‌బంక్ ఏర్పాటు కోసం రూ.80లక్షల మంజూరుకు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 1500 మెట్రిక్‌టన్నుల గోదాము నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. సహకార సం ఘంలో రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. రుణాల చెల్లింపునకు సంబంధించి వన్‌టైమ్ సెటిల్మెంట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీఈవో శ్రీనివాసులు, డైరెక్టర్లు కృష్ణగోపాల్, ఎక్బాల్‌పాషా, నర్వ శ్రీనివాస్‌రెడ్డి, అంజమ్మ, వెంకట్రాములు, ప్రతాప్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
పోల్కంపల్లి సింగిల్‌విండోలో..
మండలంలోని పోల్కంపల్లి సింగిల్‌విండో కార్యాలయంలో బుధవారం మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చి న రుణాల వసూలు, నూతనంగా మం జూరు చేయనున్న రుణాలపై చర్చించారు. అనంతరం సింగిల్‌విండో సేవలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బండా వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తూము శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్లు పి.రాంకుమార్, గడ్డమీది భీమన్న, యాదయ్య, వెంకటయ్య, ఆంజనేయులు, సునీత, సువర్ణ, వెంకటమ్మ, దావమ్మ తదితరులు పాల్గొన్నారు.