తాడూరు, మే 25 : కాంటా చేసిన మొక్కజొన్నను గోదాముల వద్ద అన్లోడింగ్ చేయడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ తాడూరు మండలంలో కొమ్ముగుట్ట సమీపంలోని గోదాం, ఇంద్రకల్ వద్దనున్న మహాలక్ష్మి కాటన్మిల్, వద్ద సోమవారం ఉదయం, సాయ ంత్రం మొక్కజొన్న రైతులు నాగర్కర్నూల్ – జడ్చర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారం పది రోజుల కిందట మొక్కజొన్న ను ట్రాక్టర్లలో తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ట్రాక్టర్లలోని మొక్కజొన్నలు ఖాళీ కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
గత వారం రోజు ల కిందట ఐతోల్ గ్రామ సమీపంలోని మిల్లు దగ్గర అదేవిధంగా ఓంకార్ మిల్లు దగ్గరికి వెళ్తే గోదాములు నిండాయని మహాలక్ష్మి కాటమల్లు దగ్గరికి వెళ్లాలని సూ చించారు. అక్కడికి వెళ్తే తాడూరు మండలానికి సంబంధించిన మక్కలు కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలు గ్రామాల లారీల మేరకు మక్కలు వస్తే మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు మక్కలను దింపుకొంటున్నారని తాడూరు మండలానికి సంబంధించిన మక్కలు దిం పడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.
వర్షానికి, ఎండలకు తాళలేక మా పరిస్థితు లు ఇబ్బందిగా మారిన అధికారులకు ఎలా ంటి స్పందన లేదంటున్నారు. అంతేకాకుండా అధికార పార్టీ నాయకుల సంబంధిత మక్కలు కూడా త్వరగా దింపుకొంటున్నారు. అక్కడకక్కడ వర్షాలు పడుతుండడంతోపాటు రైతులు ఈ సీజన్లో ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేసుకునే వారమని రోజు తరబడి ఇక్కడ ఉన్న కూడా ఇప్పటివరకు మక్కలు దింపుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉదయం 12 గంటలకు ఒకసారి ధర్నా చేస్తే సంబంధిత అధికారులు వచ్చి 20 ట్రాక్టర్లు, రెండు లారీలు దించాలని చెప్పారు. దానికి రైతులు ఒప్పుకోవడంతో రాస్తారోకో విరమించుకున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన లారీలను ఖాళీ చేయడంతో రైతులు సాయంత్రం 6గంటలకు
చెప్పిన విధంగా చే యడం లేదని రాస్తారోకో చేపట్టడంతో రో డ్డుపై వెళ్లే వాహనాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సం బంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చిన మక్కల ట్రాక్టర్లను, లారీలను ఖాళీ చేయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లారీల్లోని మక్కలను నంద్యాలలో దించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేద ని రైతులు ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి మక్కల అన్లోడింగ్ సమస్యకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే చీక టి పడుతుండడం..ట్రాఫిక్ జాం కావ డం తో రైతులు ఆందోళన విరమించారు.