Nagarkurnool | బిజినేపల్లి, జూలై 16 : బిజినేపల్లి మండల పరిధిలోని లింగాసానిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ విగ్రహా ధ్వంసంకు నిరసనగా బుధవారం బిజినపల్లి మండల బంద్ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు వెంటనే పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రమైన బిజినపల్లితో పాటు, మండలంలోని ఆయా గ్రామాలలో దుకాణాలు, విద్యాసంస్థలు మూసి ఉంచారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్, దశరథం, రాజు, సాగర్, లక్ష్మయ్య, శివప్రసాద్, రాములు, నరసింహ, చెన్నయ్య, తిరుపతయ్య, అంజి, శీను, వెంకటేష్, శ్రీశైలం, రవి తదితరులు ఉన్నారు.