Congress| బోడబండ తండాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు.. యథేచ్ఛగా అధికార పార్టీ ఎన్నికల ఉల్లంఘన
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ నియమావళిని (Election Code) ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపిస్తున్నారు.
కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ నియమావళిని (Election Code) ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపిస్తున్నారు. విపక్ష పార్టీల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కొల్లాపూర్ మండలం బోడబండ తాండ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ (Sarpanch Candidate) బరిలో ఉన్న మేనావత్ రాముడు నాయక్ ఫ్లెక్సీ (Flex Banner) దర్శనమిచ్చింది. అధికారంలో ఉన్నామని ఎన్నికల కోడ్ తమకు వర్తించదని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టంగా తెలిపేందుకే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులైన సర్పంచ్ అభ్యర్థులపై, సానుభూతిపరులపై కాంగ్రెస్ బెదిరింపులకు దాడులకు తెగబడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నికల ముందు ఇచ్చిన దొంగ హామీలపై ప్రజలు ఓటు రూపంలో తిరగబడుతున్నారని స్పష్టంగా తెలియడంతోనే అధికార కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బోడబండ తండా గ్రామపంచాయతీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ‘నమస్తే తెలంగాణ’ స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు వివరణ కోరగా.. ఫ్లెక్సీ ఏర్పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందో రాదో తెలియదని, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటానని తెలిపారు. ఎన్నికల ఉల్లంఘన జరిగిందని భావిస్తున్న బోడబండ తాండ గ్రామపంచాయతీకి గ్రామ కార్యదర్శిని పంపించి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి మేనావత్ రాముడు నాయక్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బోడ బండ తండా సర్పంచ్ అభ్యర్థి, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

