వడ్డేపల్లి, మే 13 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులోని ఒక బూత్‌లోని ఈవీఎం ప్యాడ్(బ్యాలెట్ యూనిట్)పై ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కారు గుర్తును గుర్తు తెలియని వ్యక్తి మార్కర్ పెన్ను తో గీసి కనపడకుండా చేశారు. గు ర్తించిన ఓటర్లు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించడం తో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. సెక్టోరియల్ ఆఫీసర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. పైపాడులోని 167వ బూత్‌లో 1,196 ఓట్లు ఉన్నాయి. అన్ని బూతుల మాదిరిగానే ఇక్కడ కూ డా సజావుగా ఓటింగ్ జరిగింది.
1,196 ఓట్లకు గానూ 848 ఓటు వద్ద కారు గుర్తు కనిపించకుండా ఓ వ్యక్తి మార్కర్‌తో గీసినట్లు గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అరగంటకు పై గా పోలింగ్ నిలిపివేసి అధికారుల ఆదేశాల మేరకు కా రు గుర్తుపై ఉన్న ఇంకును బట్టతో తుడవడంతో యథావిధిగా పోలింగ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో మొత్తం 873 ఓట్లు పోలైనట్లు సెక్టోరియల్ అధికారి తెలిపారు. కారు గుర్తు కనిపించకుండా మార్కర్‌తో గీయడంతో అ రగంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకు న్న ఎస్పీ రితిరాజ్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ యథావిధిగా సాగుతుందని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
బీఆర్ఎస్కు ఓట్లు పడకుండా చేయాలనే ఉద్దేశంతో కారు గుర్తుపై స్కెచ్‌తో గీసిన వారిని గుర్తించి చర్యలు తీ సుకోవడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, తమకు న్యా యం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.