మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబర్ 26 : పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో మంగళవారం సాంబారు, చట్నీలో బొద్దింక రావ డం కలంకలం రేపింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆం దోళన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే యగా, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఎంహెచ్‌వో కృష్ణ, మహబూబ్‌నగర్ అర్బన్ తాసీల్దార్ ఘాన్సీరాం తనిఖీ చేసి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
సిబ్బంది తక్కువగా ఉండడం, ప్రధానంగా వారికిచ్చే అరకొర వేతనా లు సరిపోకపోవడంతో శుభ్రతపై దృష్టి సారించడం లేదు. సి బ్బంది చాలా వరకు సివిల్ సప్లయ్ అధికారులు సరఫరా చే సిన బియ్యం నేరుగా నానబెట్టి.. వండి వడ్డిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటిని చెరిగి, పురుగులు ఇతరత్రా చెత్తా చెదా రం తీసివేసి శుభ్రపర్చాల్సి ఉంటుంది. నాసిరకమైన కూరగాయలు, గుడ్లు అందించడం కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణాలుగా చెప్పొచ్చు. కాగా, సాంబారులో బొద్దింక వచ్చిందం టే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని బీఆర్ఎస్వీ పీయూ కన్వీనర్ భరత్‌బాబు అన్నారు.
అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం తగదన్నారు. సాంబారు, అన్నంలో పురుగులు వచ్చినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌చారి తెలిపారు. ఈ విషయమై వం ట సిబ్బందిని అడిగితే ఇంట్లో వస్తే తీసేసి తినమా అంటూ వి ద్యార్థులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, విద్యార్థులు అన్నం, సాంబారు పెట్టుకొని వెళ్లే సందర్భంలో ప్లేట్లో బొద్దింక పడిందని, ఫిర్యాదు చేస్తే మళ్లీ వండించి భో జనం వడ్డించామని ఎస్సీ కళాశాల వసతిగృహ అధికారి తారాబాయి చెప్పడం గమనార్హం.
మహబూబ్‌నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ అపరిశుభ్రంగా ఉండడాన్ని అధికారులు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు. దీం తో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కుక్‌ను తొలగించాలని, హెచ్‌డబ్ల్యూవోను బదిలీ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.