వెల్దండ : తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ( CM Relief Fund) ఎంతోగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ( Goli Srinivas Reddy ) అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రాయకంటి గిరి రోడ్డు ప్రమాదంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా గోళి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 60 వేల చెక్కును బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, చంద్రమోహన్ రెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షులు జోగయ్య, మధుసూదన్ రెడ్డి, కలకొండ మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి, కొండల్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, జంగ్లీ ఆనంద్, ప్రవీణ్, శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్, రాజు, రవి,గణేష్ తదితరులు పాల్గొన్నారు.