అంకెల గారడీ బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, తప్పుల తడకలా బడ్జెట్ అని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశంలో అంబేదర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగించడం సిగ్గుచేటైన విషయమన్నారు.
- కమీషన్ల కోసమే సీఎం కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు పనులు
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, మార్చి 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, తప్పుల తడకలా బడ్జెట్ అని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశంలో అంబేదర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగించడం సిగ్గుచేటైన విషయమన్నారు. అంబేదర్ చెప్పిన విధానం ప్రకారం కాంగ్రెస్ నాయకులు నడుచుకుంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఎందుకు ప్రభుత్వంలో పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, అలా అయితే రైతులు ఎందుకు ఇబ్బందులు ఎదురొంటున్నారో సీఎం బహిర్గతపరచాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు దఫాలుగా రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయలేదని ఆరోపించారు. సాగునీటి పై ప్రత్యేక దృష్టి సాధించామని చెబుతున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎం నియోజకవర్గానికి తీసుకెళ్తున్న కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం సీఎం కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులు ఆగమేఘాల మీద ప్రారంభించారని ఆరోపించారు. కనీసం ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఏవిధంగా చేపడతారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సీఎం మక్తల్- నారాయణపేట రోడ్డుకు రూ.210 కోట్లతో నాలుగులేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి మూడు నెలలు దాటినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరికి తాను అభివృద్ధి చెందడానికి సమయం కేటాయిస్తున్నారు తప్పా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు.
ప్రస్తుతం తాను చేపడుతున్న మత్స్య అభివృద్ధి శాఖకు ఎన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించారు, ఎకడెకడ ఖర్చు చేస్తారో బహిర్గతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలు కోసం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేసి అసెంబ్లీ, శాసనమండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశపెట్టనున్నారని, ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్ని సహకరించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ముందుకు రా వాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం హితవు పలికారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, నాయకు లు అన్వర్ హుస్సేన్, మన్నన్, జట్ల సాగర్, గవినోల న ర్సింహారెడ్డి, అమ్రేశ్, అశోక్, ఈశ్వర్ యాదవ్, సుదర్శన్ గౌడ్, సాధిక్, వినోద్, అభి గౌడ్, అశోక్‌గౌడ్, మారెప్ప తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

