దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 2 : అన్నివర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను పేదలు దేవుడిగా కొలుస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో శుక్రవారం పర్యటించి పింఛన్‌కార్డులు, రైతుబీమా, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా చిన్నచింతకుంట మండలానికి చెందిన ఆరుగురికి రైతుబీమా చెక్కులను అందజేశా రు. చింతకుంట, మద్దూర్, ఏదులాపూర్ గ్రామాలకు చెంది న 158మంది ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు. అలాగే 39మందికి సీఎం సహాయని ధి చెక్కులను అందజేశారు. ఏదులాపూర్ నుంచి లక్ష్మీదేవిపూర్కు వెళ్లే మట్టిరోడ్డు మరమ్మతుకు రూ.5లక్షల ప్రొసిడింగ్‌ను అందజేశారు. తిర్మలాపూర్‌లో రూ.5లక్షలతో వాల్మీకి భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే తిర్మలాపూర్‌కు చెందిన 31మందికి పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు.
దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో 193మందికి పింఛన్‌కార్డులు, 46మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ 2014కు ముందు నియోజకవర్గంలో 3,755మందికి మా త్రమే రూ.200 పింఛన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం 6,234మందికి పింఛన్ ఇస్తున్నదని తెలిపారు. అలాగే కొత్తగా మరో 1,438మందికి ఆసరా పింఛన్ మంజూరు చేసినట్లు చెప్పారు. వృద్ధులు, వితంతులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పిం ఛన్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్ని సామాజిక వర్గాలు, కులవృత్తిదారుల అభ్యున్నతికి సం క్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సీఎం సీటులో ఉన్నందుకే ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అందరి అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎం పీపీలు రమాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు అన్నపూర్ణ, రాజేశ్వరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, టీఆర్ఎస్ అధ్యక్షులు జెట్టి నర్సింహారెడ్డి, కోటరాము, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, చల్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి, వెంకట్రాములు, శేఖర్‌రెడ్డి, రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు.