అచ్చంపేట రూరల్ : జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ( Strike ) విజయవంతం చేయాలని సీఐటీయూ (CITU ) జిల్లా సహ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. అచ్చంపేట సీఐటీయూ కార్యాలయంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి రాములు, నాయకులు సైదులు , ఆశా వర్కర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, నాయకురాలు సైదమ్మ, ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఎఫ్ నాయకులు కేశవులు, బాలయ్య, హమాలీ సంఘం నాయకులు లక్ష్మయ్య, రేలయ్య, సివిల్ సప్లై గోదాం నాయకులు రేనయ్య , డీపీ నాయకులు బాలస్వామి, ఆర్టీసీ నాయకులు రాములు , ఎస్ఎఫ్ఐ నాయకులు సైదులు తదితరులు పాల్గొన్నారు.