ఆదివారం తెల్లవారుజామున నుంచే వైభవంగా నిర్వహించారు. తమకు అందుబాటులో ఉన్న చర్చీలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు. ఆయా జిల్లాకేంద్రాల్లోని చర్చీల్లో యేసు బోధనలు వినిపించారు. అంతకుముందు కేక్ కట్‌చేసి తినిపించుకున్నారు. చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త దుస్తులు ధరించిన క్రైస్తవులు విద్యుద్దీపాలు, క్రిస్మస్ ట్రీతో ముస్తాబు చేసిన చర్చీలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు. కేక్‌లు కట్ చేసి సంబురాలతో హోరెత్తించారు. మహబూబ్‌నగర్, వనపర్తిలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– నెట్వర్క్ నమస్తే తెలంగాణ, డిసెంబర్ 25