రైతుకష్టం రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు ?
రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్‌రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్, జూలై 15 : రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్‌రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వానలు పడక పంటలు ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన సీఎం పంటలు కాపాడుకోవాలంటే రైతుల రక్తంతో పంటను కాపాడుకోవాలని మాట్లాడడం చూస్తుంటే, ఈ సీఎం తన పరిపాలన ఒత్తిడి అంతా రైతులపై వేస్తున్నారని అర్థమవుతుందన్నారు.
ప్రస్తుతం కృష్ణ, భీమా నదుల్లో నీరు లేక రైతులు పంటలు సాగు చేయడానికి అరిగోస పడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు రోజు 80వేల క్యూసెకుల వరద వచ్చి ప్రాజెక్టుల్లో చేరుతుందని, ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి తెలంగాణ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సత్తాలేని సీఎం అని దుయ్యబట్టారు. సమా వేశంలో పార్టీ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

