తిమ్మాజిపేట : మానసిక స్థితి సరిగా లేని బాలిక ఇంటి నుంచి వెళ్లిపోగా రైల్వే పోలీసుల సహాయంతో ఆమెను పోలీసులు ఇంటికి చేర్చారు. తిమ్మాజీపేట ( Timmajipeta) గ్రామానికి చెందిన బాలిక (13) కు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఈనెల 1 సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆ బాలిక గద్వాల రైల్వే స్టేషన్ ( Gadwarl Railway Station) లో సంచరిస్తుండగా గమనించిన రైల్వే పోలీసులు బాలిక వివరాలు సేకరించారు.
తనది చేగుంట గ్రామమని, నాగర్ కర్నూల్ దగ్గర ఉంటుందని చెప్పడంతో అధికారులు ఆమెను నాగర్ కర్నూల్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ( Child Welfare ) అధికారులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. అనంతరం పూర్తి వివరాలను సేకరించి చేగుంట గ్రామానికి తీసుకువచ్చి 1098 టీం కోఆర్డినేటర్ మౌనిక, మరో అధికారిని కవిత బాలికను తల్లిదండ్రులకు అప్పగించినందుకు రైల్వే పోలీసులకు, అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు మధు, మల్లేష్, అంగన్వాడీ టీచర్ శ్రీలక్ష్మి, బీ ఆర్ఎస్ నేత గడ్డం చెన్నయ్య, తదితరులు ఉన్నారు.