మక్తల్ అర్బన్, అక్టోబర్ 25: పట్టణంలో కన్యకాపరమేశ్వరీ మాతా శోభాయాత్ర వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వాసవీమాత ఉత్సహ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ఉంచి కన్యకాపరమేశ్వరీ ఆలయ నుంచి అంబేద్కర్, ఆజాద్‌నగర్, గాంధీచౌక్, బ్రాహ్మణవాడీ మీదుగా ఆర్యవైశ్య మహిళలు దాండియా, బతుకమ్మ, అడుగుల భజనలు, చిన్నారుల ఆటా పాటల మధ్య అమ్మవారి శోభాయాత్ర అంగరంగవైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కట్ట సురేశ్, శ్రీనివాస్, బొ రిశెట్టి భాస్కర్, వెంకటేశ్, నరహరి, నాగరాజ్, తాళంపల్లి అనిల్, వట్టం రతన్, రతన్, నరేశ్, కిరణ్, రంజిత్, సుభా ష్, నవీన్, తిరుపతి, మీరాబాయి, విజయలక్ష్మి, పద్మసరళ, సంధ్య, ప్రసన్న, త్రివేణి, సుజాత, ప్రత్యూషా, శోభ, ఉషారాణి, సుస్మిత,అశ్విని, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, అక్టోబర్ 25: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల నిమ్మజనం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో స్వర్ణకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం, కన్యకా పరమేశ్వరీ ఆలయం, కోట్ల ఆంజనేయస్వామి ఆలయం, స్పటిక లింగేశ్వరస్వామి ఆల యం, వేంకటేశ్వరస్వామిఆలయం, మల్లాపురం ఆల యం, వాల్మీకి నగర్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాల ను ఆయా సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలో మహిళలు, యువ తీ యువకులు కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో నృ త్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గాడి లక్ష్మినారాయణ, ఆయా ఉత్సవ కమిటీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
అమరచింత, అక్టోబర్ 25: పట్టణంలోని కాళికామాత ఆలయంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మున్సిపాల్ చైర్పర్సన్ మంగమ్మ ప్రారంభించినట్లు ఆలయ నిర్వాహకులు నాగేశ్వర్‌రెడ్డి, తా టికొండ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారన్నా రు. ఈ సందర్భంగా భక్తులు వస్తురూపంలోకానుకులతో పాటు పట్టుచీరలు, వడి నింపి మొక్కలు చెల్లించుకున్నారన్నారు. అమ్మవారిని అలంకరించిన పట్టుచీరలను భక్తుల సమక్షంలో వేలం వేస్తామని, అలాగే అమ్మవారికి వడి నింపిన బియ్యంతో భక్తులకు అన్నదానం చేశామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.