వంగూరు, నవంబర్ 25 : రోడ్డుపై వేసిన వరికుప్పలపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు కారు బోల్తా పడగా ఒకరు గాయపడిన ఘటన మండలంలోని డిండిచింతపల్లి శివారులో సోమవారం చోటుచేసుకున్నది. వివరాలిలా.. మండలంలోని తిప్పారెడ్డిపల్లికి చెందిన విద్యు త్ కాంట్రాక్టర్ రేణయ్య మిట్టసదగోడులో నడుస్తున్న విద్యుత్ పను ల కోసం విద్యుత్ సామగ్రిని తీసుకొని కారులో వెళ్తున్నాడు.
డిండిచింతపల్లికి చెందిన కుమ్మరి మల్లయ్య వరి కుప్పలను నూర్పిడి కోసం సింగిల్ రోడ్డుపై రెండు ఫీట్ల ఎత్తులో ఉంచాడు. కారులో వెళ్తు న్న రేణయ్య వరి కుప్పలను చూసి బ్రేక్ వేయడంతో కుప్పలపై జారి 100 ఫీట్ల దూరంలో గాల్లోకి లేచి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీం తో రేణయ్య తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చూసి పోలీసులకు సమాచారమందించి రేణయ్యను ఓ ప్రైవేట్ దవాఖాన కు, కారును షెడ్డుకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత కాంట్రాక్టర్ తెలిపా రు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధ్యుడిపై చర్య లు తీసుకోనున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.