కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 5 : కల్వకుర్తి మండలం సత్యసాయినగర్ సూర్యలత కాటన్‌మిల్లు బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావును కూడా కలిశారు.
కాటన్‌మిల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా మూడోసారి ఎ న్నిక కావడంతో సూర్యప్రకాశ్‌రావును సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్యం, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు మధు, విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు మల్లేశ్, బాలయ్య, రాజు, కిశోర్‌రెడ్డి, లింగం ఉన్నారు.