శతమానం భవతి
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరూవాడ కేక్‌లు కట్ చేసి జన నేతకు బర్తుడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప లు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ని ర్వహించారు.
- ఘనంగా జననేత కేటీఆర్ జన్మదినోత్సవం
- ఉమ్మడి పాలమూరులో వేడుకల జోరు
- ఆలయాల్లో పూజలు చేసిన నేతలు
- పలు చోట్ల రక్తదానాలు, అన్నదానాలు
- మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు
- యువనేతకు సబ్బండవర్గాల ఆశీర్వాదం
- పెద్ద ఎత్తున కేక్ కటింగ్‌లు హోరు
- ప్రభుత్వ దవాఖానల్లో పండ్ల పంపిణీ
- కెనడాలో కేటీఆర్ బర్త్‌డే వేడుకలు
మహబూబ్‌నగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరూవాడ కేక్‌లు కట్ చేసి జన నేతకు బర్తుడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప లు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ని ర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కొందరు మొక్కలు నాటారు. శతమానం భవతి అంటూ స బ్బండవర్గాలు ఆశీర్వాదం అందించాయి. పలు ఆలయాల్లో గులాబీ పార్టీ శ్రేణులు కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మశ్వర స్వామి, జోగుళాంబ అమ్మ ఆలయాల్లో పూజలతోపాటు.. షాఅలీ ఫహిల్వాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం పూజలు జరిపారు. గద్వాల జరిగిన రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయు డు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మాజీ జెడ్పీటీసీ బాసు శ్యా మల ఆధ్వర్యంలో రక్తదాన శిబి రం నిర్వహించారు. అలాగే నా గర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నిశిత్గౌడ్ తన స్నేహితులతో కలసి కెనడాలోని టోరొంటోలో రామన్న బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి విషె స్ తెలిపారు. ఆయన మరింత కాలం ప్ర జాసేవలో ఉండాలని, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని అణిచివేత వేసే కుట్రపై ప్రవాస నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

