Narayanpeta | మరికల్ : ఈనెల 27న వరంగల్లో నిర్వహించే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సమావేశానికి మరికల్ మండలం నుండి కార్యకర్తలు దండుల కదిలి రావాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నుండి ప్రతి గ్రామం నుండి గులాబీ సైనికులు దండులా కదిలి వరంగల్ చేరుకోవాలని కోరారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్.రాజేందర్ రెడ్డి సారథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి రజతోత్సవ వాల్పోస్టర్లను, స్టిక్కర్లను అతికించి సమావేశంలో పాల్గొన్న విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లను అందించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరికల్ మండల మాజీ వైస్ ఎంపీపీ రవి కుమార్ యాదవ్, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మతిన్, పట్టణ అధ్యక్షులు సూరిటి చంద్రశేఖర్, నాయకులు సూరుటి శ్రీనివాసులు, కొండారెడ్డి, రామస్వామి, జగదీష్, కర్లీ కృష్ణయ్య, పెంట మీద నర్సింలు, బాలకృష్ణ, మసన్న, ఎలిగండ్ల హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.