మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కార్పొరేషన్‌గా ఆవిర్భవించడంతో దానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలతో మార్కెట్లను ఏర్పాటు చే స్తుంటే కాంగ్రెస్ నేతలు వాటిని పూర్తి చేయలేక డైవర్షన్స్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. పట్ట ణం విస్తరిస్తున్న దృష్ట్యా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత మా ర్కెట్తో పాటు మరికొన్ని చోట్ల ఆధునిక హంగులతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టిం ది. ప్రజలకు అందుబాటులో వీటిని ఏర్పా టు చేసేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శం కుస్థాపనలు చేసి పనులు చేపట్టారు. పాత మార్కెట్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆర్అండ్బీ అతిథిగృహం పక్కకు, మెట్టుగడ్డ ప్రాంతాల్లో ఈ ఆధునిక మార్కెట్ల ను నిర్మించాలని నిర్ణయించి పనులను చేపట్టారు. కార్పొరేషన్ విస్తరిస్తున్న దృష్ట్యా కాలనీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కె ట్, ఫిష్ మార్కెట్‌తోపాటు హై జనిక్గా ఉండేటట్లు వీటిని ని ర్మిస్తున్నారు.
మార్కెట్లో జ నం అడుగు పెడితే అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఒకే చోట దొరికే అవకా శం ఉంటుంది. ప్రస్తు తం జిల్లా కేంద్ర ం లో ఎక్కడపడితే అక్కడ మటన్ చికెన్, ఫిష్ తో పాటు కూరగాయలను రో డ్డు ప క్కకి అ మ్ముతున్నా రు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుండా ఇక్కడ అమ్ముతున్న వాటిని చూస్తే ఈగలు దోమలు ముసరే పరిస్థితి ఉంది. రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు చో ట్ల ఆధునిక వ్యవసాయ మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదించి పనులను చేపట్టింది. కూరగాయలు అమ్మే వాళ్లు, మటన్, చికెన్, ఫిష్ అమ్మే వ్యాపారులు ఇతర మార్కెట్ అవసరాల కోసం చిరు వ్యాపారులు కూడా ఉచితంగా ఇందులో సరుకులను అమ్ముకోవచ్చు. కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. అవసరం ఉన్న చోట్ల సెంట్రల్ ఏసీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నిర్మాణాలతో కార్పొరేషన్‌లోని అనేక కాలనీల ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేశారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ మార్కెట్లకు మంగళం పాడింది. అతిథి గృహం పక్కన ఏర్పాటు చేసిన అతిపెద్ద మార్కెట్ స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించి.. అందుకు తగ్గట్టుగా పనులను చేపడుతున్నారు. ఇప్పటికే రెండు చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ మాత్రం లేకపోవడంతో ఇక్కడ ప్రతిపాదించారు. దీన్ని తొలగించి గ్రంథాలయం చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మార్కెట్లు పూర్తి కాకపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు అమ్ముతున్నారని.. వారంలో రెండు మూడుసార్లు మటన్, ఫిష్ మార్కెట్‌కు రోడ్ల పక్కనే దుర్గం ధం మధ్య అమ్మే పరిస్థితి ఉందని వీటివల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉందని ముందు చూపుతో బీఆర్ఎస్ ప్రభు త్వం ఆధునిక మార్కెట్లను అందుబాటులోకి చేస్తే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ఆరోగ్యం పట్టని నేతలు బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను తుడిచి పెట్టాలనే ఇలాంటి పనులను చేపడుతున్నారని విమర్శించారు. పాత మార్కెట్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ప్రత్యేక పోవడంతో ఎక్కడపడితే అక్కడ కూరగాయలు అమ్మే పరిస్థితి ఉంది ప్రజలు ఆధునిక మార్కెట్లకు రాకుండా కాంగ్రెస్ నేత లు కుట్రలు పండుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కాంగ్రెస్ నేతలు పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వీటిని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.