వనపర్తి, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర స్థా యిలో సంచనలం సృష్టించిన బొడ్డు శ్రీధర్‌రెడ్డి హ త్య జరిగి రెండ్రోజులైనా నిందితుల ఆచూకీ మా త్రం లభించడం లేదు. చిన్నంబావి మండలం ల క్ష్మీపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి రాజకీయంగా మాజీ ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో హత్యకు ప్రాధాన్యత చేకూరింది. ఈ ఘ టనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పం దించడంతో రాష్ట్రస్థాయిలో సంచలనమైంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ హత్యతోపాటు ఇటీవ ల ఐదునెలల కాలంలో బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలపై చోటుచేసుకున్న వరుస ఘటనలను కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఏకరువు పెట్టారు.
ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అధికార పార్టీ ము సుగులో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీపల్లి ఘటన అధికార పార్టీని ఇరకాటంలో పడేసినైట్లెంది. దీంతో తమపై వచ్చిన ఆరోపణలను మంత్రి జూపల్లి సైతం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(గాంధీభవన్)లో ప్రెస్‌మీట్ పెట్టిన అనంత రం మరో టీవీ చానల్లో డిబేట్ కొనసాగించి హ త్యతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చె ప్పుకొచ్చారు. ఇలా అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో లక్ష్మీపల్లి మర్డర్ కేసు మరిం త వేడిని పుట్టిస్తున్నది.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ జ రుపుతున్నారు. హత్య జరిగిన తెల్లారి లక్ష్మీపల్లికి చే రుకున్న పోలీసులకు హత్యకు సంబంధించిన క్లూస్ లభించక పోవడంతో విచారణకు అధిక సమయం తీసుకుంటున్నది. హత్య జరిగి రెండు రోజులు కావడం.. రాజకీయంగా పెను దుమారం లేవడం తో పోలీసులకు ఈ మర్డర్ సవాల్‌గా నిలుస్తున్నది. హత్య జరిగిన స్థలంలో హంతకుల ఆనవా ళ్లు, డాగ్ స్వాడ్ ద్వారా బలమైన ఆధారాలు లభిం చకపోవ డంతో దర్యాప్తు చేపట్టడం పోలీసులకు మరింత కష్టమవుతున్నది. ఇప్పటి వరకు శ్రీధర్‌రెడ్డి హితులు.. సన్నిహితుల ద్వారా వివరాలు సేకరిస్తు న్న పోలీసులు, మర్డర్‌లో నిజానిజాలను తేల్చేందుకు రెం డు, మూడు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశా రు.
ఇప్పటివరకు పర్సనల్ విషయాలు, ఆర్థిక లా వాదేవీలపైన దర్యాప్తు చేస్తుండగా.. రాజకీయ కో ణంలోనూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. హత్య జరిగిన మరుసటి రోజు వనపర్తి ఎస్పీ రక్షితామూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు సంబంధించిన వివరాలపై సిబ్బందితో ఆరా తీశా రు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ను వేగవంతం చేసినప్పటికీ నిందితుల జాడ తెలియడం లేదు. కాగా..శ్రీధర్‌రెడ్డి హత్యలో భూతగాదాలు, ఇతర విషయాలంటూ వచ్చిన ఆరోపణలను శ్రీధర్‌రెడ్డి కుటుంబం ముక్తకంఠంతో ఖండిస్తున్నది. కేసును తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
లక్ష్మీపల్లి గ్రామం ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్న ది. అత్యంత సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్‌రెడ్డి దారు ణ హత్యను గ్రామస్తులు జీర్ణించుకోవడం లేదు. ఈ ఉదంతంతో ఆ ఊరి ప్రజలు భయం నీడలో బతుకును వెల్లదీస్తున్నారు. చీకటి పడీ పడకముందే ఇం డ్లన్నీ మూతపడుతున్నాయి. ఆరుబయట ఎవరూ నిద్రించడం లేదు. పోలీసులు మఫ్టీలో గ్రామానికి వచ్చి వెళ్తున్నా వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు. ఏదేమైనా శ్రీధర్‌రెడ్డి హంతకులు పట్టుబడితేనే ఉద్రిక్తతకు తెరపడనున్నది. అయితే ఈ హత్య ఘటనను అన్ని కోణాల్లో సీ ఐ నాగభూషణ్‌రావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు.