Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 25 : పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి రూ. 5 లక్షలు గతంలో విరాళం ఇచ్చినందున ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.
నూతనంగా నిర్మించిన ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి, చాలా అద్భుతంగా నిర్మించారని ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రజలందరు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ఆ అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.