గులాబీ దళం కదం తొక్కింది. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రపై భగ్గుమన్నది. పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ పథకాలను యధావిధిగా కొనసాగించాలని పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా రెండోరోజూ
మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, వనపర్తి, గోపాల్పేట, ఏదుల, ఖిల్లాఘణపురం, అచ్చంపేటలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాన రహదారులపై ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి రణభేరి మోగించింది. రోడ్లపై బైఠాయించి ప్రజాపాలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించింది. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దన్నది. ఆడబిడ్డలను గోస పెట్టనీయొద్దని హితవు పలికింది. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
మహబూబ్‌నగర్ అర్బన్,ఆగస్టు 18 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాం గ్రెస్ కుట్రలు చేస్తుందని, బీఆర్ఎస్ హయాంలో ప్రా రంభించిన పథకాలను కొనసాగించాల్సిందేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మాజీ మంత్రితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా ఉండాలని కేసీఆర్ కల్యాణ లక్ష్మి,షాదీముబారక్ పథకాలను అమలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు.
ప్రజలను నిలువునా మోసం చేసి రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు జరిగితే బీఆర్ఎస్ హయాంలో దోషులపై కఠిన శిక్షలు తీసుకున్నామని, బాలికలు చదువుకునేందుకు గురుకుల విద్యాలయాలు కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేసిందని, ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం కట్టకపోవడంతో రైతు చనిపోతే కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేయడంలేదని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బ్యా ంక్‌లో పాస్ కావడంలేదన్నారు.
కోర్టును సాకుగా చూ పుతూ ప్రభుత్వం న్యాయపరంగా ముందుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పోరాటంతో దిగివచ్చిన ఓ మంత్రి దీనిపై స్పం దించి వెంటనే న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్ప డం హాస్యాస్పందంగా ఉందన్నారు. న్యాయమైన అం శాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటే మీ బండారం వాళ్ల్లే బయటపెడుతారన్నా రు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగించడంతోపాటు తులం బంగారం, మహిళలకు ఇస్తానన్న రూ.2500 పింఛన్, విద్యార్థినులకు స్కూ టీలు, ఫీజు రీయింబర్స్మెంట్, కేసీఆర్ కిట్, రైతు బీ మా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త స్కీంలు అమలు చేయడం లేదని, పాత స్కీంలు నిలుపుదల చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పథకాలు రద్దు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేశాం..ప్రతి రోజూ నీళ్లు ఇచ్చేందుకు ట్యా ంకులు, ఇంటి ఎదుట నల్లాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు నీళ్లను కనీసం శుద్ధిచేయడం లేదని వాపోయారు.
ప్రజలు అప్రమత్తమై పోరాటాలు చేయకుంటే ఇతర పథకాలు , పింఛన్లు కూడా నిలిపివేసే ప్ర మాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రం థాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సంహులు, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు దేవెందర్‌రెడ్డి, కరుణకర్గౌడ్, రహెమాన్, ఆంజనేయులు, నరేందర్, లక్ష్మయ్య, గణేశ్, రవికిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆలీం, నరేందర్, శ్రీను నా యక్, సిద్ధిఖీ, జహంగీర్, శ్రీశై లం, కార్పొరేటర్లు నవాకాంత్, జ్యోతి, లక్ష్మి, సత్యం, హైందవి, మీ రాబాయి, మధు మోహన్, ఈశ్వర య్య, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.