కల్వకుర్తి రూరల్ : క్రీడల(Sports ) ద్వారా క్రీడాకారులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కల్వకుర్తి పట్టణ రెండవ ఎస్సై రాజశేఖర్( SI Rajashekar) అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో జడ్పీ బాలల ఉన్నత పాఠశాలలో నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎస్సై రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు బలపడడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా భావిస్తూ గెలుపు దిశగా కృషి చేయాలని కోరారు.
జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెల 7న జనగాం జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ జావలిన్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు ప్రసాద్ అంజయ్య, పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు , పలువురు పాల్గొన్నారు.