అవినీతి జలగలు.. లంచం లేనిదే పనిచేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రభుత్వ శాఖల్లో అవినీతి జలగల్లా ప్రభుత్వ ఉద్యోగులు మారారు. డబ్బులు ఇవ్వనిదే పనిచేయటం లేదు. నెలల తరబడి బాధితులను కార్యాలయాల చూట్టూ తిప్పుకంటారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఎంతో మంది పట్టుబడినా ఏ మాత్రం జంకటం లేదు. వారి బుద్ధి మారటం లేదు.
- ఉమ్మడి జిల్లాలో 19నెలల్లో 20మంది పట్టుబడిన వైనం
- కేసులు నమోదైనా మారని అధికారుల తీరు
మహబూబ్‌నగర్, ఆగస్టు 19 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రభుత్వ శాఖల్లో అవినీతి జలగల్లా ప్రభుత్వ ఉద్యోగులు మారారు. డబ్బులు ఇవ్వనిదే పనిచేయటం లేదు. నెలల తరబడి బాధితులను కార్యాలయాల చూట్టూ తిప్పుకంటారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఎంతో మంది పట్టుబడినా ఏ మాత్రం జంకటం లేదు. వారి బుద్ధి మారటం లేదు. రోజూ జేబులు నింపుకొనే ఇంటికి వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేక , ఏం చేయా లో తేలియక అమాయకులు, పేదలు కుమిలిపోతున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా గత 19 నెలల్లో 20మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా దొరకని దోరలు వందల్లో ఉంటారు.
కొన్ని శాఖల్లో మరీ ఎక్కువ..
ప్రతి జిల్లాలో ప్రభుత్వ శాఖలు 70 వరకు ఉంటాయి. అందులోని చాలా శాఖల అధికారులు లంచాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తమ వద్దకు వచ్చే ప్రజలకు పనులు చేయకుండా జలగల్లా వేధిస్తూన్నారు. రకరకాల బాధలతో సతసతమవుతూ పరిష్కారిస్తారని వస్తే అధికారులు మరింత పెద్ద సమస్య అవుతున్నారు. ఈ పరిస్థితితో అమాయకులు , నిరుపేదలకు దిక్కు తోచటం లేదు. నిరక్షరాస్యులు, పనులు కావడమే ముఖ్యమని భావించే విద్యావంతులు కూడా అధికారులకు లంచాలు ఇస్తున్నారు. కొందరు చైతన్యవంతులు మాత్రమే ఏసీబీను ఆశ్రయించి అవినీతి జలగలను పట్టిస్తున్నారు. ఇతర శాఖలతో పోలీస్తే రెవెన్యూ, స్టాంపులు , రిజిస్ట్రేషన్లు, పోలీస్, రవాణా, ఎక్సైజ్, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, పౌరసరఫరాలు, ఆర్అండ్బీ తదితర శాఖల్లో అవినీతి మరింత ఎక్కువగా ఉంది.
2025లో ఏసీబీకి పట్టుబడిన వారు ..
- ఫిబ్రవరిలో 14వ తేదీన జోగుళాంబ జిల్లా పంచాయతీ అధికారి బోగం శ్యామ్ సుందర్ రూ.2లక్షలతో ఏబీసీ అధికారులకు పట్టుబడ్డారు.
- ఫిబ్రవరి18వ తేదీన ఇసుక కేసులో మక్తల్ సీఐ గుడామోని చంద్రశేఖర్, ఏ2 శింగసాని శివ, కుర్వ నర్సింహులతో కలసి రూ.20వేలు లంచం తీసుకుంటూ చిక్కారు.
- ఏప్రిల్‌లో వనపర్తి జిల్లా విద్యుత్ శాఖ ఇంజినీర్ మానవపాడు కొండయ్య పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- జూన్ నెలలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పీఎస్ ఎస్సై జామాల్పూర్ రాంచందర్‌జీ రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యండేండ్గా పట్టుకున్నారు.
- ఆగస్టు మొదటి వారంలో నెలలో భూత్పూర్ తాసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబికీ చిక్కారు.
- ఆగస్టులో 6న ఇరిగేషన్ శాఖలోని ఆసిస్టెంట్ ఇంజినీర్ మహ్మద్ పాలమూరులో రూ. 3వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- ఆగస్టులో 8న గద్వాల జిల్లాలోని అలంపూర్‌లోని ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ముచ్చ శ్రీకాంత్ నాయుడు రూ.11వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
- సెప్టెంబర్‌లో నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని తాసీల్దార్ శాఖలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా అమర్నాథ్రెడ్డి రూ. 5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- సెప్టెంబర్ 18న రూ.40 వేలు లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా కోత్తకోట మండలంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న సీ వాసు, సర్వేయర్ జీ నవీన్‌రెడ్డిలు పట్టుబడ్డారు.
- అక్టోబర్‌లో 14న నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని విద్యుత్‌శాఖ లైన్మెన్ తోట నాగేం ద్ర రూ.15వేలు లంచం తీసుకుంటూ చిక్కారు.
- నవంబర్‌లో 18న వనపర్తి జిల్లా విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ నర్వ హర్షవర్ధన్‌రెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- డిసెంబర్ 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్లో విద్యుత్‌శాఖలో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎద్దుల వెంకటేశ్వర్లు రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
- డిసెంబర్ 19వ తేదీన వనసర్తి జిల్లాలోని వ్యవసాయశాఖలో పసుపుల ఆంజనేయులుగౌడ్ జిల్లా అధికారిగా పనిచేస్తున్న ఈయన రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్‌లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
2026 సంవత్సరంలో..
- జనవరి 8వ తేదీన వనసర్తి జిల్లా సివిల్ సైప్లె కార్పొరేషన్లో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న కుంబా జగన్మోహన్, ప్రభుత్వం డ్రైవర్ లావుడ్యా లక్ష్మణ్‌నాయక్, ప్రైవేట్ డ్రైవర్లు రూ. 50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- ఫిబ్రవరి 20వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా సుందరీకిరణ్కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు.
- మార్చి 13వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని పంచాయతీ సెకట్రరీ బోయ రంగన్న ఎక్లాస్పూర్ గ్రామంలో రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
- మార్చి 30వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ ఎస్పైగా పనిచేస్తున్న చాలమళ్లా హరిప్రసాద్‌రెడ్డి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
- ఏప్రిల్ 22వ తేదీన నారయణపేట జిల్లాలోని ఆర్డీ వో పాత్లవాత్ రాంచందర్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
- మే 26వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- జూలై 8వ తేదీన మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి సర్వేలాండ్ రికార్డ్స్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ.. ఓ రైతు దగ్గర రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిర్యాదుకు ముందుకు రావాలి..
ప్రభుత్వ శాఖల్లో అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే నేరుగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎర్రసత్యం చౌరస్తాలోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యా దు చేయండి . మా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. వారి పనులు కూడా పూర్తి చేయిస్తాం. ఫిర్యాదుకు ప్రజలు ముందుకొస్తేనే అవినీతి లంచం తీసుకోవడం ఆగిపోతుంది. – సీహెచ్ బాలకృష్ణ,
ఏసీబీ రేంజ్ డీఎస్పీ, ఉమ్మడి మహబూబ్‌నగర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

