తిమ్మాజి పేట : మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట ( Timmajipeta ) మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం ( Kalyanam ) సోమవారం కన్నుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి, కూతురు స్పూర్తి స్వామి,అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్య అతిధులుగా త్రిదండి దేవనాద రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మాజీ మంత్రికి రామానుజ జీయర్ స్వామి వారు వేద ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళమోహన్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.