మహ్మదాబాద్, జూన్ 7 : గుర్రాల దాడిలో బా లుడు గాయపడిన ఘటన మహ్మదాబాద్ మండ లం మొకర్లబాద్ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో రెండుమూడు రోజులుగా మూడు గుర్రాలు హల్చల్ చే స్తున్నాయి. అడ్డొచ్చిన వారిని గాయపరుస్తున్నాయి. ఈక్రమంలో గ్రామానికి చెందిన బాలుడు గొల్ల అరవింద్‌ను శుక్రవారం కరవడంతో దవాఖానలో చికి త్స పొందుతున్నాడు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండంలం ఘనపూర్‌లో ఆరుగురిని గాయపర్చగా వాటిని తరిమేశారు. దీంతో ఆ గుర్రాలు మండలం లో చిన్నాయిపల్లిలో పలువురిని గాయపర్చి మొకర్లబాద్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుర్రాల బారి నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.