కొల్లాపూర్ : ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని, సమాజ రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాల సొంతమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి Minister Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికరించిన అధునాతన కంప్యూటర్లు, పుస్తకాలతో ఏర్పాటుచేసిన డిజిటల్ గ్రంథాలయాన్ని( Digital Librarys) జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని అన్నారు. పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచనా విధానం, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని పేర్కొన్నారు. దినపత్రికలు చదవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యువతి యువకులు గ్రంథాలయంలో జ్ఞానాన్ని పెంచుకునే విధంగా గ్రంథాలయాలను వినియోగించుకోవాలని కోరారు .
కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ గ్రంథాలయాల వినియోగంతో జ్ఞానం పెరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్ , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.