నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల బాత్రూంలో రక్త పింజర పాము (Blood snake ) కలకలం రేపింది. బాత్రూంలో పాము ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం అందించగా ఆయన అక్కడికి చేరుకొని చాకచక్యంతో పాముని డబ్బాలో బంధించారు. దీంతో విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం జనసంచారం లేని ప్రాంతంలో దాన్ని విడిచి పెట్టాడు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తన 97034 76691 కి కాల్ చేయాలని స్నేక్ క్యాచర్ వంశీ కోరారు.