బిజినేపల్లి : ఏపీలోని కడపలో జరుగుతున్న 4వ సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే చాంపియన్షిప్ (Karate Competitions) పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా బిబిజేపల్లి విద్యార్థులు ( Bijinepally students ) ప్రతిభను కనబర్చారు. ఈ పోటీల్లో అభిరామ్,గణేష్ మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించగా మణికంఠ, శ్రవణక్ ద్వితీయ బహుమతి, సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీనియర్ కరాటే మాస్టర్ అశ్వక్, జగన్ మాస్టర్లు అభినందించారు. గెలుపొందిన విజేతలు భవిష్యత్లో కూడా సరైనా ప్రతిభను కొనసాగించాలని సూచించారు.