Bhoothpur | భూత్పూర్, ఏప్రిల్ 16 : ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్ కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నది.. కావున సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందువలన ఈ సభకు రావాలని చాలామంది వృద్ధులు, వికలాంగులు ఉత్సాహం చూపిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు కాకుండా యువకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
27వ తేదీన మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో నాయకులు కార్యకర్తలు జండా ఆవిష్కరణలు చేసి భూత్పూర్ మండల కేంద్రానికి రావాలని కోరారు. అనంతరం సభకు సంబంధించి పోస్టర్ను ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణ గౌడ్, మనమోని సత్యనారాయణ, వెంకటయ్య, ఫసియోద్దీన్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, బాలకోటి, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.