లింగాల, నవంబర్ 23: మండలంలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 108అంబులెన్స్‌లో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీం బుధవారం ఉత్తమ పురస్కారం అందుకున్నారు. అచ్చంపేట పట్టణంలో జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసులో పనిచేస్తున్న పైలెట్ ఈఎంటీ, కెప్టెన్ వైద్య మైలేజ్, వాహన శుభ్రత విభాగాల్లో ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి మాట్లాడుతూ ఆపదలో ఉన్నామంటూ ఫోన్ వచ్చిన అనతికాలంలోనే తమ ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రతి ఒక్కరినీ సకాలంలో దవాఖానకు చేర్చి వైద్య సేవలు అందించడమే కాకుండా వారి ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. 108 అంబులెన్స్‌లో అందరికీ అంటుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నట్లు తెలిపారు. వారి సేవలను గుర్తించి ఉత్తమ సేవా పురస్కారం అందజేసినట్లు తెలిపారు. ఉత్తమ పురస్కారం అందుకున్న పైలెట్ ఇబ్రహీంకు సింగిల్‌విండో చైర్మన్ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ రవిశంకర్, వైస్ ఎంపీపీ నారాయణగౌడ్, తోటి స్నేహితులు మన్సూర్, రాజేశ్ శుభాకాంక్షలు తెలిపారు.