వనపర్తి టౌన్, జూలై 13 : నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ న్యాయవాదులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదుల గ్రం థాలయం, సాక్షుల గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జి ల్లాలో నూతన సమీకృత భవన నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటునకు కృషి చే స్తానన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లో క్ అదాలత్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ చాంబర్లో న్యాయవాదులతో ఆయన మా ట్లాడారు. అనంతరం జిల్లా న్యాయ సమీక్ష స మావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రజిని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌యాదవ్, కార్యదర్శి బాల్నాగయ్య, సీనియర్ న్యాయవాదులు నాగేశ్వర్, పురుషోత్తం, భరత్‌కుమా ర్, మోహన్‌గౌడ్, నిరంజన్బాషా, రాంచంద్రారెడ్డి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
రంగనాథ ఆలయంలో పూజలు..
పెబ్బేరు, జూలై 13 : శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని శనివారం హై కోర్టు జడ్జి లక్ష్మీనారాయణ కుటుంబ సమేతం గా దర్శించుకున్నారు.