మహబూబ్‌నగర్ అర్బన్/నాగర్‌కర్నూల్‌టౌన్ / గద్వాల అర్బన్, జూన్ 13 : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ల ఎదుట గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మా ట్లాడుతూ ఆశ వర్కర్లును తొలగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి నియమించుకోవాలని చూస్తున్నదని, ఆ ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.
అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశ కార్యకర్తలకు ఇస్తున్న పారితోషికాన్ని రూ.18 వేలకు పెంచాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు చెల్లించడంతోపాటు పింఛన్ సౌకర్యం కూడా కల్పించాలని, ప్రతి నెలా 2వ తేదీన పారితోషికం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా జిల్లా కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రాలు అంద జేశారు. కార్యక్రమాల్లో ఆశ వర్కర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కళావతమ్మ, సీఐటీయూ మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, నాగర్‌కర్నూల్ సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాస్, నాయకులు మల్లేశ్, అశోక్‌తోపాటు ఆయా జిల్లాల ఆశ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.