గద్వాలటౌన్, మే 12 : పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.. ఆ పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉంటా యి.. సాధ్యమైనంత మేరకు పండ్లను తీసుకుంటే మంచి ది.. అనారోగ్యంతో ఉన్న రోగులు పండ్లను విరివిగా తిన డం ద్వారా త్వరగా కోలుకుంటారు.. ప్రతిరోజూ ఏదో ఒక పండు తీసుకోవడం మంచిదని డాక్టర్లు నిత్యం రోగులు, ప్రజలకు చెబుతున్నారు.. కానీ ఇప్పుడు అవే పండ్లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి.. ఎందుకంటే ఇప్పడు అంతా కృత్రిమంగా అయ్యింది.. పండ్లను పండించడం నుంచి మాగపెట్టడం దాకా అంతా రసాయనాల మయమే అయ్యాయి.. దీంతో మాధుర్యం కాస్త విషపూరితంగా మారుతున్నది. ఆహారం ద్వారా లభించే శక్తితోనే మన జీవనయానం సాఫీగా సాగుతున్నది. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. కానీ ప్రస్తుతం అరటి, సపోట, మా మిడి తదితర పండ్లను మాగబెట్టే విధానాన్ని చూస్తుంటే పైమాట వాస్తవం కాదనిపిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యానికి మంచి పండ్లను తీసుకోవాలి. కానీ నేడు అసంపూర్ణ ఆరో గ్యం కోసం పండ్లను కొనుగోలు చేస్తున్నట్లు ఉన్నది. ఎందుకంటే కొందరు పండ్ల వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా కాల్షియం, కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలతో పండ్లను మాగపెట్టి విక్రయిస్తున్నారు. ఈ రసాయనం వల్ల ప్రా ణాంతకమైన వ్యా ధులు సంభవించే అవకాశం ఉన్నది.
రోగాలు తప్పవు..
రసాయనాలు కలిసిన పండ్లను తినడం ద్వారా చిన్న పి ల్లలు, గర్భిణులకు ప్రాణాంతకరమైన వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు గర్భస్రావం అ య్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకని రసాయనాలు కలిసిన పండ్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రజ లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అరటి పండ్లు..
నిత్యం పిల్లలతోపాటు పెద్దవారి వరకు భోజనం తర్వా త ఇష్టంగా తినే అరటిపండు సైతం విషపూరితంగా మా రింది. చిన్నపిల్లలు ఏమి తినకపోయినా ఫర్వాలేదు అరటిపండు తింటే చాలని పెద్దవారు సూచిస్తుంటారు. కానీ వారికి అరటిలో కాస్తంత విషం దాగి ఉందన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. త్వరగా పండ్లు మాగి విక్రయించి లాభించాలన్న ఉద్దేశంతో వ్యాపారులు ఇష్టానుసారం గా అరటికాయలను రసాయనం కలిపిన నీళ్లలో ముంచి మాగపెడుతున్నారు. వీటిని కొనుగోలు చేసిన ప్రజలు మాత్రం రోగాల బారిన పడుతుంటే.. దళారులు మాత్రం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వ్యాపారాలు చేస్తున్నారు.
మామిడి, సపోటలు కూడా..
పండ్లను చూస్తే వాటిని ఎప్పుడెప్పుడు తినాలా అనే ఆశ కలుగుతుంది. ఆయా సీజన్లలో మార్కెట్లో పం డ్లు కనిపిస్తే చాలు కొనుగోలు చేయని వారు ఎవరూ ఉండరు. మాధుర్యంలో కూడా తనకు సాటి ఎవరు లేరని చాటుకుంటున్న ఈ పండ్లలో కాస్తంత విషం దాగి ఉన్నది. అంటే సహజంగా పండే పండ్లలో కాదండోయ్. కాయలను తెచ్చి వాటికి నిషేధిత రసాయనాలతో మాగబెట్టిన పండ్ల వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. 30కిలోల మామిడి కాయలకు 200గ్రాముల రసాయనాన్ని కలుపుతున్నారు. మండిలో పండ్ల మధ్య అక్కడక్కడ రసాయనాన్ని ఉంచడం ద్వారా ఉదయం అయ్యే సరికి పూర్తిగా మాగిన పండ్ల మాదిరి మామిడి కాయలు మాగుతున్నాయి. పార్సిల్ చేసేటప్పుడు ముందుగానే ఆ డబ్బాల్లో రసాయనాన్ని ఉంచడం ద్వారా అవి బాగా మాగిన పండ్ల మా దిరి కనిపిస్తున్నాయి. కానీ ఇలా మాగిన పండ్లు ఎక్కువ రోజు లు నిల్వ ఉండడం లేదు. అంతేకాక ఎక్కువ రోజులు నిల్వ ఉం డడం ద్వారా పండ్లలో పురుగులు పడుతున్నాయి. దీంతో వా టిని తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిషేధిత రసాయనాన్ని యథేచ్ఛగా వాడుతున్నా నియంత్రించక పోవడంపై అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం అవుతున్నది.