వనపర్తి, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డిని హత్య చేసిన హంతకులను వెం టనే అరెస్ట్ చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఎస్పీ రావుల గిరిధర్‌ను కలిసి శ్రీధర్‌రెడ్డి హత్యకు సంబంధించి విషయాలపై చర్చించారు. ఇటీవలే చిన్నంబావి మండలం కేంద్రంలో హంతకులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టిన క్రమంలో బీరం ఎస్పీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి ఏడు నెలలు గడిచినా హంతకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో విడ్డూరంగా ఉందన్నారు.
హంతకులను పట్టుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చేయడం వల్ల కుటుంబ సభ్యులు, ప్రజలు ఆత్మైస్థెర్యం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని, ఇప్పటికే ఏడు నెలలు వేచి చూశామని, మా సహనానికి పరీక్ష పెట్టవద్దన్నారు. హంతకులను పట్టుకునేదాకా వదిలేది లేదని, ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేపడతామని బీరం తేల్చిచెప్పారు. హత్య కేసుపై నాన్చుడు ధోరణి విడనాడి త్వరగా హంతకులను అరెస్ట్ చేయాలని బీరం ఎస్పీని కోరగా త్వరలోనే హంతకులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో బీరంతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు అభిలాష్‌రావు, సోమేశ్వరమ్మ, వెంకట్రావమ్మ, చిన్నారెడ్డి, గోవింద్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, నాగన్నయాదవ్ తదితరులు ఉన్నారు.